Health Insurance: నిజమే కదా.? హెల్త్ ఇన్స్యూరెన్స్ వుంటే.. ఆరోగ్యశ్రీతో పనేముంది.? ఈ చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా చర్చనీయాంశమవుతోంది. జనసేన క్రియా శీలక కార్యకర్తల కోసం ఐదు లక్షల భీమా చేయిస్తున్నారు జనసేనాని.
‘పార్టీ కార్యకర్తల కోసం సొంతంగా భీమా చేయిస్తున్నాం. అధికారంలోకి వస్తే, ప్రజలకు పాతిక లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు చేయించలేం. కుటుంబం మొత్తానికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ వుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులుండవు కదా.?’ అని జనసేనాని తాజాగా జనసేన వారాహి యాత్ర సందర్భంగా ప్రస్తావించారు.
ఇన్స్యూరెన్స్.. అన్న మాటని జనసేనాని ప్రస్తావించినప్పుడు, ‘చనిపోతే ఇచ్చేది ఇన్స్యూరెన్స్ సొమ్ము..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం వితండవాదానికి దిగింది. అయితే, ఈ రోజుల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి తెలియనిదెవరికి.?
ఆరోగ్యశ్రీ కోసం వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ మొత్తాన్ని ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రజల కోసం వినియోగిస్తే.. అనూహ్యమైన రీతిలో మార్పులొస్తాయ్.. హెల్త్ కేర్ రంగంలో.
ఏ పథకంలో అయినా చిన్నా చితకా సమస్యలు వుండొచ్చు.. అది వేరే విషయం. ఆరోగ్యశ్రీతో పోల్చితే, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తేలికైన విషయం. ఇదిప్పుడు జనంలోకి నేరుగా వెళ్ళిపోయింది. పాతిక లక్షల వరకు.. అన్న మాట మరింతగా జనానికి కనెక్ట్ అవుతోంది.
వారాహి యాత్ర సందర్భంగా జనసేనాని చెప్పిన ఈ మాట, జనసేన వైపుగా జనం మళ్ళేందుకు ఉపయోగపడుతోందని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడుతున్నారు.
Alzheimer’s disease is a type of dementia that causes problems with memory, thinking and behavior. Symptoms usually develop slowly and get worse over time, becoming severe enough to interfere with daily tasks.