ఉత్తర ప్రదేశ్ ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన అంబికా ప్రసాద్ పటేల్ అనే 25 ఏళ్ల యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. గ్రామంలో అతడిని బంధించిన గ్రామస్తులు సజీవ దహనం చేయడంతో స్థానికంగా సంచలనంగా మారింది. అదే గ్రామానికి చెందిన లేడీ కానిస్టేబుల్‌ను ప్రసాద్ పటేల్ ప్రేమ పేరుతో వేదించాడు. ఆమెకు చెందిన అసభ్యకర వీడియోను చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రేమించేందుకు ఒప్పుకోక పోవడంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.
తన అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ ప్రసాద్ పటేల్‌పై పోలీసులకు సదరు యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని మూడు నెలల క్రితం జైలుకు పంపించింది. జైలు జీవితం గడిపి వచ్చిన ప్రసాద్ పటేల్‌పై ఆ గ్రామస్తుల కోపం తీరలేదు. అతడు గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే యువతి తండ్రితో పాటు చాలా మంది అతడిని బంధించి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత అతడికి నిప్పు అంటించి చంపేశారు. సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు.
774418 401389Great day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any ideas? 662009
891718 651013Aw, this was a quite nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an exceptional write-up?but what can I say?I procrastinate alot and undoubtedly not appear to get one thing done. 798035