Switch to English

బిగ్ క్వశ్చన్: వైఎస్ జగన్‌కి ‘ప్రతిపక్ష నేత’ హోదా ఎవరిచ్చారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కొలువుదీరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో శాసన సభ్యులుగా పదవీ ప్రమాణం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాకి తగిన స్థాయిలో ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకోలేకపోయిన దరిమిలా, వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనన్నది ఓ వాదన.

కాస్సేపట్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన విడుదలవుతుంది. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది కూడా.

స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి నియామకాన్ని ఇప్పటికే వైసీపీ తప్పుుపట్టింది. కానీ, అయ్యన్న పాత్రుడికి పోటీగా, వైసీపీ ఇంకో అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, అసెంబ్లీకి వెనుకదారిలో హాజరైన వైఎస్ జగన్, ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం అనంతరం, ఎక్కువసేపు అసెంబ్లీలో వుండలేకపోయారు. వుండి వుంటే, బావుండేదన్న చర్చ అంతటా జరుగుతోంది.

ఇదిలా వుంటే, వైఎస్ జగన్ సొంత పత్రిక సాక్షి, తమ యజమానికి ‘ప్రతిపక్ష నేత’ అనే హోదాని కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతానికైతే వైఎస్ జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపు అలాగే వుంటుంది లెండి. అది మళ్ళీ వేరే చర్చ.

మొత్తం 11 మంది ఎమ్మెల్యేలున్నారు వైసీపీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో. దాంతో, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశమే లేదు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అవకాశం వుండకపోవచ్చు. అయితే, కూటమి ప్రభుత్వం గనుక.. టీడీపీ తర్వాత అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ జనసేన అయినా, విపక్షం మాత్రం వైసీపీనే అవుతుంది.

ఎలా చూసినా జగన్ మోహన్ రెడ్డిని విపక్ష నేతగా ప్రస్తావించాలి తప్ప, ప్రతిపక్ష నేత అనడానికి వీల్లేదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. ఇంకా నయ్యం, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డే సీఎం అనే భావనలో, ఆ దిశగా జగన్ సొంత పత్రికలో ‘సీఎం జగన్’ అనే ప్రస్తావన కనిపించలేదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక...

Viral: మామిడి రూ.2400, మ్యాగీ ప్యాక్ రూ.300, మసాలా రూ.95..! ఎక్కడంటే..

Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

పంచాంగం తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు,...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...