Switch to English

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయ్.! దీన్నే కర్మ ఫలితం అనాలేమో.!

అప్పట్లో వైసీపీకి 23 అసెంబ్లీ సీట్లు రాగా, జనసేన పార్టీకి ఓ సీటు దక్కింది. టీడీపీ నుంచి కొందర్ని లాగేసిన వైసీపీ, జనసేనకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా లాగేసింది. అంతేనా, ‘మీ పార్టీ నుంచి ఐదుగుర్నో ఆరుగుర్నో లాగేస్తే, మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షాత్తూ టీడీపీని ఉద్దేశించి అసెంబ్లీలోనే వెటకారం చేశారు.

ఇప్పుడేమయ్యింది.? ప్రతిపక్ష హోదాని వైసీపీ అడుక్కోవాల్సి వస్తోంది. ఇంకా పార్టీ ఫిరాయింపులు మొదలవకుండానే. ఇదీ దేవుడి స్క్రిప్టు అంటే. చట్ట సభల్లో ప్రతిపక్ష హోదా కావాలంటే, కనీసం 10 శాతం సంఖ్యాబలం వుండాలన్నది ఓ నిబంధన.

ఆ లెక్కన వైసీపీకి అసెంబ్లీలో వుండాల్సిన శాసన సభ్యుల సంఖ్య 18. అయితే, వైసీపీకి ప్రస్తుతం వున్న శాసన సభ్యుల సంఖ్య 11 మాత్రమే. సంఖ్యా పరంగా చూసుకుంటే, జనసేన పార్టీకి 21 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. అయితే, జనసేన పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో భాగమై వుంది.

శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా.? వద్దా.? అన్నదానిపై టీడీపీ అలాగే జనసేన.. ఇంకోపక్క బీజేపీ.. ఈ మూడూ కలిసి సానుకూల నిర్ణయం తీసుకుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాస్త ఊరట దక్కుతుంది.

గతంలో, వైసీపీ గతంలో చేసిన అవమానాల నేపథ్యంలో, వైసీపీకి తగిన శాస్తి చేయాలనే ఆ మూడు పార్టీలూ అనుకుంటున్నాయి. తప్పు తెలిసొచ్చేలా చేయకపోతే, ఎప్పటికీ వైసీపీలో మార్పు రాదు.! పైగా, ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కి రాసిన లేఖలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘బతిమాలుకోవడం’ మానేసి, రూల్స్ మాట్లాడేశారు మరి.!

ఇంతకీ, ప్రతిపక్ష హోదా దేనికి.? ప్రతిపక్ష నేత హోదా వుంటే, అది క్యాబినెట్ ర్యాంక్‌తో సమానం. జీత భత్యాలు కూడా ప్రత్యేకంగా వుంటాయి. జీత భత్యాలతో ఇబ్బందేమీ లేదుగానీ, ఆ క్యాబినెట్ హోదా కోసమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడిలా దేబిరించాల్సి వస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ (ముఖ్యమంత్రి హోదాలో కూడా) ఇంతలా లేఖ రాసింది లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా కావాల్సి వచ్చేసరికి, ఏకంగా నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాసేశారు.

వై నాట్ 175 అంటూ విపక్షాల్ని అవమానించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి జస్ట్ 11 సీట్లు మాత్రమే మిగిలాయ్. పార్టీ ఫిరాయింపుల పర్వం షురూ అయితే, సింగిల్ సింహంలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీలో మిగిలిపోతారంతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

ఎక్కువ చదివినవి

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

పార్టీని కాపాడుకోవడం ఎలా.? వైసీపీలో అంతర్మధనం.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ,...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి: రేణూ దేశాయ్

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ దేశాయ్ (Renu Desai) చేసిన పోస్టుపై...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...