జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం ‘దేవర( Devara )’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్టీఆర్ తన ఫ్రెండ్ అయిన ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసింaది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన జోడి ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక(Rashmima mandhanna) హీరోయిన్ గా నటిస్తుండగా, ‘ యానిమల్ ‘ మూవీ తో ఆకట్టుకున్న బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం.
అయితే ఈ సినిమాలో తారక్ కి జంటగా మరో హీరోయిన్ గా అలియా భట్( Alia Bhatt) ఎంపికైనట్లు తెలుస్తోంది. ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాలో ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆలియా అందులో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఆ ప్రాజెక్టు తర్వాత ‘దేవర’ లో ఆలియా భట్ నటిస్తుందని వార్తలు వచ్చినా..అందులో సడన్ గా మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్( Jahnvi Kapoor) ఎంటర్ అయింది.
దీంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో అలియా భట్ ని ఖరారు చేశారని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.