Switch to English

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా జరుగుతోంది.

మీడియా రంగానికి రామోజీరావు చేసిన ‘సేవల’ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సేవల్ని ఒక్కొక్కరూ ఒక్కోలా అభివర్ణిస్తుంటారు. దాన్ని రాజకీయ సేవగానూ కొందరు పేర్కొంటుంటారు. సరే, ఎవరి అబిప్రాయం వారిది.

మీడియా మొఘల్ మాత్రమే కాదు, పలు సినిమాలు నిర్మించిన సినీ నిర్మాతగానూ ఆయనకు గుర్తింపు వుంది. రామోజీ ఫిలిం సిటీ, ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు, ఓటీటీ, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి.. చెప్పుకుంటూ పోతే కథ పెద్దదే.

పెద్దాయన చనిపోయారని తెలుసుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.. రామోజీరావు పాడెని చంద్రబాబు మోశారు కూడా. అది ఆయన వ్యక్తిగతం. కానీ, రామోజీరావు సంస్మరణ సభను, అధికారికంగా నిర్వహించడం మీదనే రాద్దాంతం జరుగుతోంది. దానిక్కారణం, ప్రజాధనాన్ని వెచ్చించడమే.

అంతే కాదు, పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఓ వైపు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుందని చెబుతూనే, ఇంకో వైపు ప్రభుత్వం తరఫున ఈ దుబారా ఏంటన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంటుంది.

చంద్రబాబు సొంత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగితే ఓ లెక్క.. కానీ, ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. ఈ దుబారాని జనసేన, బీజేపీ ఎలా సమర్థించుకుంటాయన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వవం తరఫున కాకుండా, పార్టీ తరఫున గనుక టీడీపీ ఈ సంస్మరణ సభను నిర్వహించి వుంటే బావుండేదేమో.!

ఈనాడు వల్ల ఎంతమంది వృద్ధిలోకి వచ్చారో, అంతమంది ఇబ్బందులు పడ్డారన్న వాదనా లేకపోలేదు. అలాంటప్పుడు, మీడియా రంగానికి రామోజీ చేసిన సేవ వుందని ప్రశ్నించేవారూ వున్నారు మరి.! మార్గదర్శి వివాదం సంగతి సరే సరి.! ఏదిఏమైనా, పోయినోళ్ళంతా మంచోళ్ళేనని సరిపెట్టుకోవాల్సిందేనేమో.!

అయ్యిందేదో అయిపోయిందనుకోవడానికి వీల్లేదు. ప్రజలు అన్నిటినీ గమనిస్తారు. ప్రజాధనం వృధాపై టీడీపీ, జనసేన, బీజేపీ గతంలో చాలా మాట్లాడాయ్. వైసీపీ హయాంలో జరిగిన ఈ తరహా దుబారాపై జనం విసిగిపోయారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే దుర్వినియోగమంటే, ప్రజలు సహించే పరిస్థితి వుండకపోవచ్చు.

రామోజీరావు టీడీపీకి రాజగురువు అయితే కావొచ్చు.. రాష్ట్ర ప్రజలకు కాదు కదా.! అన్నట్టు, అమరావతి నిర్మాణానికి రామోజీ కుటుంబం (వ్యాపార సంస్థల తరఫున) 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించడం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న...

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

పవన్ మార్కు ‘మార్పు’.! పేర్లు మారుతున్నాయ్.!

చిన్న చిన్న మార్పులు.. పెద్ద పెద్ద ఆనందాల్ని ఇస్తాయ్.! రాజకీయాల్లో ఎవరు అధికారంలో వుంటే వారు, తమ పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం చూస్తున్నాం. తమ పేర్లతోనో, తమకు నచ్చినవారి పేర్లతోనో...

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...