గుడ్రం రవితేజ కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్. అతడు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. రమ్మీ, కాసినో గేమ్స్‌కు బానిస అయ్యాడు. తన వద్ద ఉన్న డబ్బును మాత్రమే కాకుండా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కూడా మెల్లగా తన ఖాతాలో జమ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ మొత్తంతో గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఖాతాదారులు జమ చేసిన డబ్బు విషయంలో లెక్క తేలక పోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు బ్యాంకు ఉద్యోగులను ప్రశ్నించగా అసలు విషయం బయట పడినది. రవితేజ గేమ్స్‌కు బానిస అయ్యి బ్యాంకు నుండి ఏకంగా కోటికి పైగా కాజేసినట్లుగా లెక్కలు తేలాయి. ఆ మొత్తంలో సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేసిన రవితేజ మిగిలిన సగంను కూడా బెట్టింగ్స్ కాశాడు. రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి నుండి అమౌంట్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకు విధుల నుండి ఆయన్ను తొలగిస్తున్నట్లుగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
374040 536699Some times its a discomfort within the ass to read what blog owners wrote but this site is extremely user friendly ! . 40008
642417 389794extremely nice post, i surely enjoy this fabulous website, persist with it 331199
108075 551536Fantastic write-up. I appreciate your attention to this topic and I learned a whole lot 461496