Switch to English

బీజేపీ రివర్స్ ఎటాక్: ఏపీ డీజీపీ మళ్ళీ స్పందిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

దేవాలయాలపై దాడులు తదితర వ్యవహారాలపై ఆంధ్రపదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇటీవల చేసిన ప్రకటన పెను రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ, టీడీపీలకు చెందిన పలువురు కార్యకర్తలు, సానుభూతిపరుల్ని ఆయా కేసుల్లో అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన విషయం విదితమే. అయితే, దాడుల అనంతరం జరిగిన దుష్ప్రచారానికి సంబంధించి నిందితుల్ని అరెస్ట్ చేశామన్నది డీజీపీ ప్రకటన సారాంశం.

కానీ, వైసీపీ అనుకూల మీడియాలో మాత్రం ఈ వ్యవహారంపై ప్రచారం ఇంకోలా సాగింది. నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా, దేవాలయాలపై దాడుల వ్యవహారం విపక్షాల కనుసన్నల్లో జరిగిందని సెలవిచ్చారు. వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే, రాత్రిళ్ళు టార్చిలైట్ వేసుకుని.. అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయం విదితమే. ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతల వ్యాఖ్యలకు అనుగుణంగానే డీజీపీ ప్రకటన వుందంటూ విపక్షాలు మండిపడ్డాయి.

సజ్జల స్క్రిప్ట్, వైఎస్ జగన్ డైరెక్షన్, డీజీపీ యాక్షన్.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్ కూడా వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు ఏపీ డీజీపీకి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. మీడియాలో, డీజీపీ వ్యాఖ్యల పేరుతో వచ్చిన కథనాల్లో ‘దేవాలపై దాడులకు బీజేపీకి సంబంధం వుంది’ అన్నట్లుగా అర్థం కనిపిస్తోందనీ, ఈ వ్యవహారంపై స్పందించకపోతే, పరువు నష్టం దావా వేస్తామనీ సోము వీర్రాజు తన లేఖాస్త్రంలో అల్టిమేటం జారీ చేశారు.

రాజకీయాల్లో ఇదో కొత్త పోకడగానే చెప్పుకోవాలి. ‘పరువు నష్టం దావా’ అంటూ, ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, డీజీపీకి లేఖ రాయడమంటే చిన్న విషయం కాదు. నిజానికి, అంతర్వేది రధం దగ్ధం వంటి పెద్ద కేసుల్లో నిందితుల్ని పట్టుకుని, వారెవరన్నది తేల్చాల్సిన పోలీసులు, దుష్ప్రచారానికి కారకులంటూ విపక్షాలకు చెందినవారిపై కేసులు పెట్టడం ఒకింత ఆశ్చర్యకరంగానే వుంది. కొండని తవ్వి ఎలుకని కూడా పట్టుకోలేని వైనం.. అనే విమర్శలు రాజకీయ పరిశీలకుల నుంచీ వినిపిస్తున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 03 జూలై 2024

పంచాంగం తేదీ 03- 07- 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు తిథి: బహుళ ద్వాదశి ఉ....

కర్ణార్జున యుద్ధం మళ్ళీ జరగాల్సిందేనా.?

కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు… సినిమాలపై పవన్ రియాక్షన్

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...