Switch to English

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.!

కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని నానా దుర్భాషలాడుతున్నవారితో జత కట్టాడు.! రాజకీయాలు వేరు, స్నేహం వేరు.. అని సొల్లు కబుర్లు కుదరవిక్కడ. స్నేహమంటే స్నేహమే. పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా అలీకి వున్న గుర్తింపు, గౌరవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, అదంతా ఒకప్పుడు. పవన్ కళ్యాణ్‌కి అలీ స్నేహితుడిగా వున్నంత కాలమే.

ఆ స్నేహాన్ని చెడగొట్టుకున్నాడు కమెడియన్ అలీ.! సరే, రాజకీయంగా అలీకి వేరే ఆలోచనలు వుండొచ్చు. అది తప్పు కాదు. కానీ, పవన్ కళ్యాణ్‌ని ద్వేషించే పార్టీలో చేరడం, పవన్ కళ్యాణ్‌ని తిడుతున్నవారితో చేతులు కలపడం, పవన్ కళ్యాణ్‌ని ఎగతాళి చేయడం.. ఇదంతా ఏంటి.?

‘నేనెవరి మీదా వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు..’ అంటూ అలీ ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబుతున్నాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లూ ప్రకటించేశాడు అలీ. అసలు రాజకీయాల్లో అలీ సాధించింది ఏంటి.? ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేమో, రాజకీయ సన్యాసం.!

అదే, పవన్ కళ్యాణ్ వెంట అలీ నడిచి వుంటే.? ఈ రోజు రాజకీయాల్లో అలీ స్థాయి వేరే లెవల్‌లో వుండేది. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ని నానా దుర్భాషలు ఆడుతోంటే, ఏనాడూ వారిని వారించిన పాపాన పోలేదు అలీ. ఇప్పుడు రాజకీయాలకు దూరమంటున్న అలీ, పవన్ కళ్యాణ్‌తో పాత స్నేహాన్ని తిరగతోడే ప్రయత్నం చేస్తాడేమో.

‘అలీని మాత్రం దగ్గరకు రానివ్వొద్దు..’ అని పవన్ కళ్యాణ్‌కి ఆయన అభిమానులు సూచిస్తున్నారు. సరే, పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేరే చర్చ. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ, ‘నేను సుద్ద పూసని.. నేను సేవా కార్యక్రమాలు చేశాను..’ అని అలీ చెప్పుకున్నా, ఆయన మీద కాస్తంత సింపతీ కూడా వచ్చే పరిస్థితి లేదు.

వైసీపీ హయాంలో పదవులు అనుభవించి, వైసీపీ ఓడిపోగానే పార్టీ వదిలేశాడంటూ వైసీపీ నుంచి విమర్శలూ అలీ ఎదుర్కోవాల్సి వస్తోంది. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది అలీ పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...