పంచాంగం
తేదీ 21- 06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు
తిథి: శుక్ల చతుర్దశి ఉ.6.32 వరకు, తదుపరి పూర్ణిమ
నక్షత్రం: జ్యేష్ఠ సా. 6.28 వరకు తదుపరి మూల
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 12.24 నుంచి 1.12 వరకు
శుభ సమయం: సా 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12. 00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సమస్యలు చుట్టుముడతాయి. ఫలితంగా గందరగోళానికి గురవుతారు. వ్యాపార విస్తరణలో భాగంగా రుణాలు చేయవలసి వస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది.
వృషభ రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంటి పెద్దలతో చర్చించడం మంచిది. కుటుంబ సభ్యుల ముందు గతంలో చేసిన తప్పులను బయటపెట్టాల్సి వస్తుంది.
మిథున రాశి: సంయమనం పాటించాలి. చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబ వివాదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. స్నేహితుల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.b
సింహరాశి: కుటుంబ సమస్యలు తలెత్తడం వల్ల ఒత్తిడికి గురవుతారు. చట్టపరమైన వివాదంలో చిక్కుకుంటారు. ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.
కన్యారాశి: దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్తు ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టేవారు తెలివిగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది.
తులారాశి: పిల్లల ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. స్నేహితుడు నుంచి అందిన వార్త ఆందోళనకు గురిచేస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారంపై దృష్టి పెట్టడం వల్ల లాభాలను పొందవచ్చు. భాగస్వామి మొండి ప్రవర్తన వివాదానికి దారితీస్తుంది.
వృశ్చిక రాశి: సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. స్థిరాస్తిపై పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి: కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి సరైన సమయం. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ సమస్యలను తండ్రితో చర్చించడం వల్ల పరిష్కారం అవుతాయి.
మకర రాశి: ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. చట్టపరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. తొందరపాటు ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యల్లో బయట వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించాలి.
కుంభరాశి: మొండి ప్రవర్తన కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. మొండి బకాయిలు వసూలు చేయడం కష్టమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తను వింటారు.
మీన రాశి: వృత్తిపరమైన సమస్యలను స్నేహితులతో చర్చించడం వల్ల పరిష్కారం అవుతాయి. పిల్లల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. కుటుంబ సభ్యుల్లో వివాదాలు తలెత్తినప్పుడు మౌనంగా ఉండటం మంచిది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు.