Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,365FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు
తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు
నక్షత్రం: ధనిష్ట ప. 3.41 వరకు తదుపరి శతభిషం
దుర్ముహూర్తం: ప. 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: సా 4.00 నుంచి 5.00 వరకు
రాహుకాలం: ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన ఆదాయాన్ని పొందుతారు. భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి: సమయస్ఫూర్తితో అందరినీ మెప్పిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరించాలి. వ్యక్తిగత సమస్యలను తల్లితో చర్చించడం వల్ల పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

మిథున రాశి: అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శక్తికి మించి శ్రమించాల్సి వస్తుంది. అధిక పని భారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు మౌనం గా ఉండటం మంచిది.

కర్కాటక రాశి: సమస్యలు పెరుగుతాయి. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ఎవరితోనూ వాగ్వాదం చేయరాదు. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంలో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది.

సింహరాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో పై చేయి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ.. పరస్పరం చర్చించుకోవడం వల్ల అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

కన్యా రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. ఓర్పుతో ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సమస్యలు చుట్టుముట్టడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది.

తులారాశి: ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. మంచి ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అధిక శ్రమ కారణంగా అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.

వృశ్చిక రాశి: ఇంటి పెద్దల సహకారంతో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టు పెట్టాలనుకునే వారికి సరైన సమయం. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి.

ధనస్సు రాశి: ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. చాలాకాలంగా కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.

మకర రాశి: స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి.

కుంభరాశి: తప్పుదారి పట్టించే వారు ఉన్నారు. సమయ స్ఫూర్తి తో వ్యవహరించాలి. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోరాదు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.

మీన రాశి: గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు చర్చించుకోవడం వల్ల తొలగిపోతాయి. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: నెట్టింట సెన్సేషన్.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ పిక్ వైరల్

Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ కల్యాణ్ స్టేట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం...

ముష్టి ఫర్నిచర్ కాదు.! ప్రజల కష్టం.!

ముష్టి ఫర్నిచర్.. ఎవడిక్కావాలి.? అంటూ మాజీ మంత్రి కొడాలి నాని, మీడియా ముందర నోరు పారేసుకున్నారు. ‘కొడాలి అన్న మాస్’ అంటూ పేటీఎం కూలీలు షరామామూలుగానే ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఏది ‘ముష్టి’.? కాస్సేపు, అది...

Renu Desai: ఆ మాటలు బాధిస్తున్నాయి.. ఇకనైనా ఆపండి: రేణూ దేశాయ్

Renu Desai: నెటిజన్లు తనపై చేస్తున్న కామెంట్లపై అసహనం వ్యక్తం చేసారు. తనను దురదృష్టవంతురాలని పిలవడం బాధిస్తోందని.. అలా పిలవొద్దని ఎంత చెప్పినా వినటంలేదని రేణూ దేశాయ్ (Renu Desai) ఆవేదన చెందారు....

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...