Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు.

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు.
తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: పూర్వభాద్ర ప. 12.36 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర.
దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, తిరిగి ప. 12.24 నుంచి 1.12 వరకు.
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు.
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: మిశ్రమంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు పొందుతారు. పాత అనారోగ్యం మళ్లీ తిరగబడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి: వినూత్న రీతిలో ఆలోచించి అందరు మెప్పు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. వ్యాపారులు భాగస్వామ్యులతో కొత్త వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

మిథున రాశి: వ్యాపారులు గణనీయమైన లాభాన్ని పొందుతారు. వేరొకరి సలహాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాదాల జోలికి పోరాదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది.

కర్కాటక రాశి: శ్రేయోభిలాషులతో వివాదాలకు దిగకండి. ఉద్యోగులు వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి పెద్దల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది.

సింహరాశి: వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. ఎటువంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొనసాగుతున్న మనస్పర్ధలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తీవ్రమవుతాయి.

కన్యారాశి: ఉదర సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కావున ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు. ముఖ్యమైన విషయాల్లో ఎవరి సలహాలు తీసుకోకపోవడం మంచిది. కుటుంబంలోని అవివాహితులకు వివాహ యోగ్య సూచనలు ఉన్నాయి.

తులారాశి: చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఒత్తిడి కారణంగా కీలక సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోలేక పోతారు. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పరస్పర అవగాహన ఉండాలి.

వృశ్చిక రాశి: సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి పెద్దల సలహా పాటించడం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆస్తి వివాదాలు తీవ్రమవుతాయి. కీలక సమయాల్లో సహనంతో వ్యవహరించాలి. తోబుట్టువుల సహకారం అందుతుంది.

ధనస్సు రాశి: ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చాలాకాలం తర్వాత పాత స్నేహితులని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

మకర రాశి: ఆర్థికంగా ఆదుకునే వారు ఉన్నారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రతికూల వాతావరణం ఆరోగ్యం పై ప్రభావం చూపించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభరాశి: గిట్టని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి. పని భారం వల్ల ఒత్తిడికి గురవుతారు. చాలా కాలంగా మనసులో నెలకొన్న గందరగోళం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది.

మీన రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. బయట వ్యక్తులతో ఎటువంటి సమాచారాన్ని పంచుకోరాదు. భాగస్వామ్య వ్యాపారంలో నష్టపోవాల్సి రావచ్చు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలి. ఎవరితోనూ వాగ్వాదం పెట్టుకోకపోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్ అశ్విన్ పోస్ట్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే సినీ...

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్ హాసన్

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా 28ఏళ్ల తర్వాత సీక్వెల్ గా భారతీయుడు2...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి: రేణూ దేశాయ్

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ దేశాయ్ (Renu Desai) చేసిన పోస్టుపై...

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...