Switch to English

పరదాలకీ, ప్రజా సేవకీ.. తేడా చూపెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,362FansLike
57,764FollowersFollow

ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే.

పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి వెళ్ళే పరిస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండేది కాదు.. ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ.! ఏం.? ఎందుకిలా.? ముఖ్యమంత్రికి భద్రత కల్పించడమంటే.. మరీ ఇలానా.?
చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో జనంలోకి వెళుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి.! నిజానికి, పవన్ కళ్యాణ్‌కే సెక్యూరిటీ పరంగా సమస్యలెక్కువ.! వైసీపీ ఉన్మాదుల నుంచి ఆయనకు థ్రెట్ ఎప్పుడూ వుంటుంది. డిప్యూటీ సీఎం అయ్యారు కదా.. అది ఇంకాస్త ఎక్కువే వుండొచ్చు.

కానీ, పవన్ కళ్యాణ్ జనంలో వుంటున్నారు, జనంతో వుంటున్నారు. అధికారంలోకి రాకముందు జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనాని.. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం హోదాలోనూ ఆ జన వాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చినవారితో, పార్టీ కార్యాలయం యెదుటే మాట్లాడుతున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.

ఇక్కడ పరదాల్లేవ్.. కేవలం ప్రజా సేవ తప్ప.! రాష్ట్రంలో ఏ మంత్రికీ ఈ పరదా సమస్య లేదు. నిజానికి, ఏ మంత్రి కూడా.. గతంలో మంత్రుల్లా అతి చేయడంలేదు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు కూడా మంత్రుల తరహాలో.. అంతకు మించి ఓవరాక్షన్ చేయడం చూశాం.

ఇప్పుడు మంత్రులు కూడా సాధారణ ప్రజా నాయకుల్లా జనంలో తిరుగుతున్నారు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా, జనసేన ప్రజా ప్రతినిథులు, తాము ప్రజల్లో ఒకరం.. అన్నట్లుగా.. గతంలో వున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కాకపోతే, ఇప్పుడు అధికారులతో పనులు చకచకా చేయిస్తున్నారంతే.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అదృశ్యానికి సంబంధించి వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, వివరాలు తెప్పించుకుంటున్నారు. నేరుగా తనకు ఫిర్యాదులు చేస్తున్నవారికి సంబంధించిన సమస్యల పరిష్కారాన్నీ వేగంగా చూపుతున్నారు.

పరిపాలన అంటే, ప్రజలకు మెరుగైన పాలన అందించడం. అంతేగానీ, పరదాల చాటున దాక్కోవడం కాదు.! పచ్చని చెట్లను నాశనం చేయడం అంతే కంటే కాదు.! పదవి అంటే బాధ్యత. పాలన అంటే సేవ.! ప్రజలకు పాలకులు ఎప్పుడూ సేవకులే.! ప్రజా ప్రతినిథుల భద్రత దృష్ట్యా ప్రోటోకాల్ తప్పు కాకపోవచ్చు.. కానీ, ప్రోటోకాల్ పేరు చెప్పి, పరదాల చాటున దాక్కుంటే.. ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా వుంటుందో ఇటీవలి ఎన్నికల్లో చూశాం కదా.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు....

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతల భేటీ.. మాట్లాడిన అంశాలివే..

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్మాతలు పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ పవన్...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

రాజకీయం ఉన్నంతవరకు పవన్ పేరు వినబడుతుంది: హైపర్ ఆది

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీల కూటమి విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కూటమి అఖండ విజయాన్ని గుర్తు చేసుకుంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో...