Switch to English

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ అందుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. నాయకుడంటే ఇలా వుండాలి.. శాసన సభ్యుడంటే ఇలా వుండాలి.. అని ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది.

స్పీకర్ ఛెయిర్‌లో కూర్చున్న చింతకాయల అయ్యన్న పాత్రుడిపైనా తనదైన ఛమక్కులతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకాలం చూపిన వాగ్ధాటిని స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు వదిలేయాల్సి వుంటుందని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు.

అర్థవంతమైన చర్చకు శాసన సభ వేదిక కావాలనీ, అంతే తప్ప బూతులు తిట్టుకోవడానికి సభా సమయాన్ని వృధా చేయరాదని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ‘గత అసెంబ్లీలో ఎలాంటి దురదృష్టకర పరిస్థితులున్నాయో చూశాం. ఆ తప్పిదాల్ని మనం చేయకూడదు. సభ్యులెవరైనా హద్దులు దాటే పరిస్థితి వుంటే, స్కూల్ మాస్టారిలా స్పీకర్ మైక్ కట్ చేయాల్సి వుంటుంది’ అని డిప్యూటీ సీఎం సూచించడం గమనార్హం.

‘మేం ఓడినా పారిపోలేదు.. దురదృష్టం, వైసీపీ పారిపోయింది. గతంలో దక్కిన అద్భుత విజయంపై విర్రవీగడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ‘భాష అనేది మనుషుల్ని కలపడానికి తప్ప, విడగొట్టడానికి కాదు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

ఎంతటి జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందనీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో తన తొలి ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు.

స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడి నియామకం పట్ల జగన్ అసహనంతో వున్న విషయం విదితమే. సభా సంప్రదాయాల ప్రకారం, స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తుల్ని ఆయా పార్టీల శాసనసభా పక్ష నేతలు, స్పీకర్ ఛెయిర్ వద్దకు తీసుకు వెళ్ళాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే...

రాజకీయం

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

ఎక్కువ చదివినవి

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

Pawan Kalyan: నెట్టింట సెన్సేషన్.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ పిక్ వైరల్

Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ కల్యాణ్ స్టేట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం...

రాజధాని అక్కర్లేదు.! ‘రాచరికపు కోటలు’ మాత్రం కావాలి.?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని అవసరం లేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘రాచరికపు కోటలు’ కావాలి.! ఔను, రాజప్రాసాదాల్ని తలపించే, ప్యాలెస్సుల్ని జిల్లాకి ఒకటి చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...