Switch to English

గణతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై సిక్కు జెండా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని ఘటన ఇది. దేశ ఆత్మగౌరవానికి ప్రతీక.. అని చెప్పుకోదగ్గ ఎర్రకోటపై సిక్కు జెండా ఎగిరింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఇటీవల తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి సంబంధించి ముందస్తు అనుమతులు కూడా తీసుకున్నారు. న్యాయస్థానాల జోక్యంతో, నిబందనల మేరకు అనుమతులు లభించాయి. అయితే, గణ తంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాక మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన రైతు సంఘాలు, దానికి భిన్నంగా.. వేడుకలు ముగియక ముందే, ర్యాలీ షురూ చేశాయి. ఆ ర్యాలీలో వేలాది ట్రాక్టర్లు ముందుగా అనుకున్న మార్గంలో కాకుండా, వేర్వేరు మార్గాల్లో ఢిల్లీలోకి చేరుకున్నాయి.

ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం, తోపులాట జరిగాయి. పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది.. భాష్ప వాయువు గోళాల్నీ (టియర్ గ్యాస్) ప్రయోగించాల్సి వచ్చింది. ఓ దశలో పరిస్థితి అదుపు తప్పడం, పలువురికి ఈ గలాటాలో తీవ్రగాయాలవడంతో పోలీసులు, ఆందోళనకారుల్ని అదుపు చేయలేక చేతులెత్తేశారు.

పోలీసులు, రైతుల మీద దాడి చేస్తున్నారంటూ, ట్రాక్టర్లు నడుపుతున్న రైతులు.. తమ ట్రాక్టర్లను రైతుల మీదకు దూకించారు. మరోపక్క, ఎర్రకోట పైకెక్కిన రైతులు, జాతీయ జెండాలతోపాటు, రైతు జెండాల్ని ,సిక్కు జెండా చేతపట్టి ఎర్రకోటపై ఎగురవేయడం గమనార్హం. ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతోపాటు, ‘జై కిసాన్’ అంటూ నినాదాలు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో హోరెత్తాయి. రైతుల ముసుగులో అసాంఘీక శక్తులు ఈ చర్యలు పాల్పడ్డాయంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, రైతులు అత్యంత శాంతియుతంగా ఆందోళనలు చేస్తోంటే, ప్రభుత్వమే రెచ్చగొడుతోందని రైతు సంఘాలు మాటల దాడికి దిగాయి.

ఏదిఏమైనా, భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తున్న వేళ, రైతులు అత్యుత్సాహం చూపారన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, సమస్యను సాగదీసి, పరిస్థితి అదుపు తప్పడానికి కారణమైన కేంద్ర పాలకుల్నీ తప్పు పట్టకుండా వుండలేం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు...

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీకి చెందిన...