Switch to English

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40 శాతం ఓట్లు వచ్చాయని చెబుతూనే.. ఇంకో వైపు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ గగ్గోలు పెడుతున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

2019 ఎన్నికల్లో కూడా అప్పటి అధికార పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయ్.. 23 సీట్లు మాత్రమే వచ్చాయ్. ఇప్పుడు వైసీపీకి కూడా దాదాపు అవే 40 శాతం సీట్లు వచ్చాయ్.. సీట్ల సంఖ్య మాత్రం 11కి పడిపోయింది.

ఎన్నికల్లో గెలుపోటములకు మధ్య తేడా ఒక్కోసారి పది పాతిక ఓట్లు కూడా వుండొచ్చు. అదే నంబర్ గేమ్ అంటే.! ఆ లెక్కన గెలిచే పార్టీకీ ఓడిపోయే పార్టీకీ మధ్య మొత్తంగా ఓ పది వేల ఓట్లు తేడా వున్నా.. ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.

‘మీకూ మాకూ తేడా ఒకటిన్నర శాతమే..’ అని ఒకప్పుడు వైసీపీ, అప్పటి అధికార టీడీపీ మీద గుస్సా అయిన సందర్భాలూ వున్నాయ్. ఇప్పుడు ఓట్ల శాతంలో తేడా కాస్త ఎక్కువే కనిపిస్తోంది కదా.! కాస్త కాదు, చాలానే తేడా వుంది. దాంతో, సీట్ల సంఖ్యలో కూడా చాలా తేడా వుంటుంది.

ప్రజలు తమను ఈడ్చి కొట్టారన్న విషయాన్ని వైసీపీ ముందుగా అర్థం చేసుకోవాలి. అది మానేసి, ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తే, వైసీపీ ఎప్పటికీ పుంజుకుని, నిలబడే పరిస్థితి వుండదు. పైగా, ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తూ, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమికి లోక్ సభలో వైసీపీ మద్దతివ్వడాన్ని ఎలా చూడాలి.?

ఎన్డీయే అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు, అందులో టీడీపీ, జనసేన కూడా వున్నాయి. అంటే, పరోక్షంగా టీడీపీ, జనసేనలకి కూడా వైసీపీ రాజకీయంగా మద్దతిస్తోందన్నమాట. మరి, ఈవీఎంల మీద ఆరోపణలు దేనికి.? ఎవర్ని మభ్యపెట్టడానికి.? 40 శాతం ఓట్లు.. 10 శాతానికో ఐదు శాతానికో పడిపోకూడదనుకుంటే, వైసీపీ.. ఇకనైనా పనికిమాలిన ఆరోపణలు పక్కన పడేసి, బాథ్యగా ప్రవర్తించాలి.

ఒక్కటి మాత్రం నిజం.. ఈవీఎం ట్యాంపరింగ్‌కి అవకాశమే వుంటే, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకునేదే.! అసలు వైసీపీకి ఒక్క అసెంబ్లీ సీటుగానీ, ఒక్క లోక్ సభ సీటుగానీ దక్కేది కాదు. వైసీపీకి ఐదారు శాతం ఓట్లు కూడా వచ్చేవి కావు మొత్తంగా.! ఈ వాస్తవాన్ని వైసీపీ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

ఎక్కువ చదివినవి

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఖైదీ,...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 జూన్ 2024

పంచాంగం తేదీ 27- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ షష్ఠి రా 8.31...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...