Switch to English

ఔను.. జనసేన గెలిచింది.. ఇదిగో సాక్ష్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో సీట్లు సాధిస్తే గెలుపు.. లేకపోతే ఓటమి.! అంతేనా, ఇంకేమీ లేదా.? గెలిచినా, ఓడినా.. జనం తరఫున నిలబడటం నాయకుడి లక్షణం. ఏ రాజకీయ పార్టీ అయినా, గెలుపోటములకు అతీతంగా వ్యవహరించాలి.. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమన్న భావనతో వుండాలి. గెలిచి, అధికార పీఠమెక్కడమంటే.. ప్రజలకు సేవ చేయడంలో ‘పెద్దన్న’ బాధ్యత దక్కించుకున్నట్లు. ఓడితే, ప్రజా క్షేత్రంలో మరింత బలంగా పనిచేయాలని అర్థం. కానీ, ఇప్పుడు రాజకీయాలకు అర్థం మారిపోయింది. అలా మారిపోయిన రాజకీయ వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు జనసేన ఆవిర్భవించిందని మొదటి నుంచీ జనసేనాని చెబుతూ వస్తున్నారు.

జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే సీటు వచ్చి వుండవచ్చు.. గెలిచిన ఆ ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరంగా వుండి వుండొచ్చు. కానీ, జనసేన ప్రజల తరఫున నినదించడం ఎప్పుడూ మానలేదు. ఇసుక సమస్య విషయంలో జనసేన పార్టీ, అందరికన్నా ముందే నినదించింది.. ప్రజల పక్షాన నిలబడింది. అప్పుడు జనసేనాని ఏదైతే చెప్పారో.. అదే నిజమని, ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జనసేనాని వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలే.. ఇప్పుడు, ఆ ఇసుక విషయంలో వాస్తవాల్ని మాట్లాడుతున్నారు.. పరోక్షంగా జనసేన పార్టీ చెప్పిందే నిజమని ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఇసుక పేరుతో పెద్ద కుంభకోణమే నడుస్తోందని సొంత పార్టీ నేతలే చెబుతోంటే, ఇంకా తమది అవినీతి రహిత ప్రభుత్వమని బుకాయిస్తే ఎలా కుదురుతుంది.? నదుల్లో అప్పనంగా దొరికే ఇసుకే కదా.. అనుకునే పరిస్థితి కాదిప్పుడు. ఇసుక పేరుతో కోట్లు చేతులు మారుతున్నాయి. అందుకే, ఇసుకకి అంత విలువ.

చిత్రమేంటంటే, అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిథులకీ ఇసుక దొరకడంలేదు. మరి, ఇసుక అంతా ఏమవుతున్నట్లు.? నదుల్లోంచి మంచి ఇసుకే బయటకు వస్తోంది.. కానీ, వినియోగదారులకు మాత్రం కల్తీ ఇసుక వెళ్తోంది. అంటే, తెరవెనుక ఏదో జరుగుతోంది. అధికార పార్టీ నేతలకే తెలియని ఆ ‘మాయ’ ఏంటి.? ఇదిప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిథులు పరోక్షంగా మంత్రుల మీదనే ఆరోపణలు చేస్తున్నారు. అధికారులపైనా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ, ఈ వ్యవహారంపై ప్రభుత్వ వాదన ఏంటి.? ఏమోగానీ, ఒక్కటి మాత్రం నిజం.. జనసేనాని చెప్పిందే నిజం. అవును, జనసేన గెలిచింది.. ప్రజల గొంతుక విన్పించింది.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడంలో విజయం సాధించింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

పవన్ కళ్యాణ్.. ఇకపై పిఠాపురం వాస్తవ్యులు

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అక్కడ 3.52 ఎకరాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ...

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 30 జూన్ 2024

పంచాంగం తేదీ 30-06-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ నవమి ప. 1.08 వరకు...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన మాస్ హీరో

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ ఈసారి ' లైలా ' అంటూ...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 03 జూలై 2024

పంచాంగం తేదీ 03- 07- 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు తిథి: బహుళ ద్వాదశి ఉ....

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...