Switch to English

వైసీపీని నిండా ముంచేస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

రాజకీయాల్నీ కులాల్నీ విడదీసి చూడగలమా.? రాజకీయాల్లో కులాల, మతాల ప్రస్తావన లేకపోవడం అనేది సాధ్యమా.? ఛాన్సే లేదు.! ఆ కులం పేరు చెప్పుకునే కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ కులాభిమానంతోనే, కొందర్ని రాజకీయ నాయకులుగా గుర్తించే పరిస్థితిని చూస్తున్నాం.

కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకున్న ముద్రగడ పద్మనాభం లాంటోళ్ళు, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, కులాన్ని అవమానించడం మొదలు పెట్టారు. దాంతో, సహజంగానే కులం అలాంటివాళ్ళను వదిలించుకుంటుంది. ముద్రగడ విషయంలో అదే జరిగింది.

తన పేరు చివర్న ‘రెడ్డి’ అనే తోకని తగిలించుకున్న ముద్రగడ పద్మనాభం పూర్తిగా, కాపు సామాజిక వర్గానికి దూరమయ్యారు. పోనీ, రెడ్డి సామాజిక వర్గం అయినా ఆయన్ని అక్కున చేర్చుకుంటుందా.? అంటే, ‘పేరు మార్చుకుంటే కులం మారిపోదు..’ అంటూ రెడ్డి సామాజిక వర్గం, ముద్రగడ పద్మనాభం మీద విసుర్లు విసురుతోంది.

ఎలా చూసినా, ముద్రగడ పద్మనాభ ‘రెడ్డి’ రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారన్నది సుస్పష్టం. ఇంతకీ, ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి వల్ల ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? తమకేదో రాజకీయంగా లబ్ది చేకూరుతుందని ఆయన్ని వైసీపీ, తనవైపుకు తిప్పుకుంది.

నిజానికి, ముద్రగడ పద్మనాభం ‘వైసీపీ అభిమానిగా’ మారి చాలా ఏళ్ళయ్యింది. ఆయన ఎప్పుడూ వైసీపీ మనిషే.! కాపు సామాజిక వర్గం తరఫున పోరాటమంటూ, ఆత్రం ప్రదర్శించింది కూడా వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చడానికే.

2019లో ముద్రగడ మంత్రం వైసీపీకి కలిసొచ్చింది. అదే ముద్రగడ మంత్రం, వైసీపీని 2024లో పూర్తిగా ముంచేసింది. ఇకపై, ముద్రగడ పుణ్యమా అని కాపు సామాజిక వర్గం, వైసీపీని శతృవుగా చూసే పరిస్థితి కనిపించనుందన్నది ఆ సామాజిక వర్గంలో వినిపిస్తోన్న వాదన.

పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ చేసే ప్రతి విమర్శా, వైసీపీకి కాపు సామాజిక వర్గాన్ని మరింత దూరం చేస్తుందన్నది నిర్వివాదాంశం. ముద్రగడకు వైసీపీ ఇంకాస్త ప్రాధాన్యతనిస్తే, రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీని దూరం పెట్టే పరిస్థితి రావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...