Switch to English

అబ్జర్వేషన్‌: తెలంగాణలో ఆర్టీసీ గమనమెటు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగినా, తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. విలీన డిమాండ్‌ని పక్కన పెట్టినట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సంకేతాలు పంపించిన తర్వాత కూడా, చర్చలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంలేదంటే ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. తెలంగాణలో ఆర్టీసీ ఉనికిని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదన్నట్లే కదా అర్థం.!

ఆర్టీసీ సమ్మెని చట్ట విరుద్ధమేనంటూ ఇంకోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆర్టీసీ కార్మికులు తాము ప్రభుత్వ ఉద్యోగులతో సమానమవుతామని అనుకున్నారు. కానీ, పరిస్థితులు మారాయి. రాజకీయ నాయకులు చెప్పే మాటలకీ, చేసే పనులకీ చాలా తేడా వుంటుందనే విషయం అర్థమయ్యేసరికి పరిస్థితి చెయ్యిదాటిపోయిందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

నిజానికి, విలీన డిమాండ్‌తో సమ్మె చేస్తున్న కార్మికుల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండడం, ఇంకొకరు ఒత్తిడితో ప్రాణాలు కోత్పోతుండడం జరుగుతోందంటే.. ప్రభుత్వం మానవీయ కోణంలో ఈ అంశాన్ని చూడాల్సి వుంటుంది.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ మరణం చోటు చేసుకున్నా, దాన్ని ‘త్యాగం’ కోటాలో వేసేశారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఇప్పుడు మాత్రం, ఆర్టీసీ కార్మికుల మరణాలకి బాధ్యత తమ ప్రభుత్వానిది కాదు.. కార్మిక సంఘాలదేనని అంటున్నారు.

తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సమాజం అంతా ఒక్కటైతే, ఆ క్రెడిట్‌ని పూర్తిగా తన ఖాతాలో వేసుకుని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి పీఠమెక్కిన విషయం విదితమే. ఇప్పుడేమో, ఆర్టీసీ విషయంలో ఇదిగో ఇలా రూటు మార్చేశారు.

ఒక్కటి మాత్రం నిజం.. సమ్మెతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ నష్టం తెలంగాణ ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీకి వాటిల్లిందన్న ఆర్టీసీ కార్మికుల వాదనలోనూ నిజం లేకపోలేదు.

ఏదిఏమైనా, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆగేలా కన్పించడంలేదు.. ప్రభుత్వమూ ఆర్టీసీని తెలంగాణలో వుంచేలా కన్పించడంలేదు. కానీ, ఆర్టీసీలో కేంద్రం వాటా.. అలాగే ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తిగా జరగలేదన్న వాదనలు.. వెరసి, కార్మికుల్లో ఇంకా ‘ఆశలు’ సజీవంగానే వుండే అవకాశం వుందన్నమాట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

ఎక్కువ చదివినవి

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్ అశ్విన్ పోస్ట్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే సినీ...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

కేంద్ర మంత్రి పదవి.. జనసేన కోరుకోలేదా.?

జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 03 జూలై 2024

పంచాంగం తేదీ 03- 07- 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు తిథి: బహుళ ద్వాదశి ఉ....

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫిలిం ఇనిస్టిట్యూట్ శిక్షణ పూర్తయ్యాక చిన్న...