Priyanka Chopra: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గాయపడ్డారు. తాను నటిస్తున్న ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ లో ఆమె మెడ దగ్గర గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో, వివరాలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటూండగా ఈ సంఘటన జరిగింది. ‘వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ పిక్స్ షేర్ చేసుకున్నారు.
ప్రమాదానికి గురైన ప్రియాంకను షూటింగ్ సిబ్బంది సిడ్నీలోని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందించారు. సంబంధిత ఫొటోల్లో.. ప్రియాంక ముఖం, పెదవి, మెడ భాగాల్లో గాయాలైనట్టు కనిపిస్తున్నాయి. మెడ వద్ద నిటారుగా చీరుకున్న గాయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ప్రమాద తీవ్రత తక్కువేనని కామెంట్స్ లో ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.
ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మాత్రం ఎటువంటి వివరణా ఇవ్వలేదు. యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తూండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక విశ్రాంతి తీసుకుంటున్నారు. అవెంజర్స్ సినిమా నిర్మాతలు రుస్సో బ్రదర్స్ ది బ్లఫ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్ దర్శకుడు.