Switch to English

South Africa: వరల్డ్ కప్ క్రికెట్.. 32ఏళ్లుగా దక్షిణాఫ్రికా దురదృష్టం కథ ఇదీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

South Africa: 2024 టీ-20 (T-20 World cup 2024) వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa)పై భారత్ విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది. నిజానికి విజయానికి చేరువలోకి వెళ్లింది దక్షిణాఫ్రికా. ఓదశలో చేతిలో ఆరు వికెట్లు, 30 బంతుల్లో 30 రన్స్ చేసేంత పటిష్ట స్థితిలో ఉంది. అయితే.. భారత్ పేసర్ల ధాటికి తడబడి ఒక్కో వికెట్ పోగొట్టుకుని భారత్ కు కప్ అప్పగించేసింది. అయితే.. దక్షిణాఫ్రికా లైనప్ ఎంత పటిష్టంగా ఉన్నా క్రికెట్ ప్రేమికులకు ఆ జట్టు దురదృష్టం గురించి కూడా తెలుస్తుంది. వాటిని పరిశీలిస్తే..

క్రికెట్లోకి పునరాగమనం చేసిన ద.ఆఫ్రికా 1992 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ తో తలపడింది. విజయానికి 13బంతుల్లో 23 పరుగులు చేయాలి. గెలిచే స్థితిలోనే ఉన్న ద.ఆఫ్రికాకు వరుణుడు పదే పదే అడ్డుపడ్డాడు. దీంతో క్రికెట్ రూల్స్ 1బంతిలో 22పరుగులు నిర్ణయించారు. దీంతో దక్షిణాఫ్రికాకు దురదృష్టం వెంటాడిందని అనుకున్నారు.

1999 వరల్డ్ కప్ ద.ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 9వికెట్లు కోల్పోయిన జట్టును లాన్స్ క్లుసెనర్ 16బంతుల్లో 31 పరుగులతో ఆదుకున్నాడు. మ్యాచ్ టై అయింది. విజయానికి కావాల్సింది 1పరుగు. క్రీజ్ లో క్లుసెనర్ ఉండగా.. అటువైపు డొనాల్డ్ ఉన్నాడు. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య మొదటి బాల్ రనౌట్ నుంచి డొనాల్డ్ తప్పించుకున్నాడు. కానీ.. తర్వాతి బంతిని క్లుసెనర్ హిట్ చేసి వెంటనే పరుగు అందుకున్నాడు.

దీనిని గమనించని డొనాల్డ్ బంతిని గమనించి ఆగిపోయాడు. కానీ.. అప్పటికే క్లుసెనర్ వికెట్ ఎండ్ కి వచ్చేశాడు. డొనాల్డ్ కూడా వెళ్లుంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేవారు. కానీ.. డొనాల్డ్ కంగారుపడి ఆగిపోవడం.. కంగారూలు రనౌట్ చేయడం జరిగిపోయి.. రెప్పపాటులో మ్యాచ్ దక్షిణాఫ్రికా చేజారిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా దురదృష్టం గురించి క్రికెట్ ప్రపంచం మరోసారి మాట్లాడుకుంది. ఇదే మ్యాచ్ లో స్టీవ్ వా బ్యాటింగ్ మొదట్లో ఇచ్చిన క్యాచ్ ను క్లుసెనర్ జారవిడిచాడు. అప్పుడు.. నువ్వొదిలేసింది క్యాచ్ కాదు.. కప్ అని స్టీవ్ వా అన్నట్టు వార్తలొచ్చాయి. నిజంగా అదే జరగడం విశేషం.

2003 వరల్డ్ కప్ లో సూపర్-8లో శ్రీలంకతో తలపడింది. చేజింగ్ లో వర్షం అడ్డుపడ్డాడు. అయితే.. డక్ వర్త్ లూయిస్ నిబంధనలు అమలయ్యాయి. ఆఖరి బంతికి సింగిల్ తీసినా ద.ఆఫ్రికా విజయం సాధించేది. కానీ.. క్రీజ్ లో ఉన్న బౌచర్ కు సరైన సమాచారం లేకపోయింది. దీంతో అతడు డాట్ బాల్ ఆడాడు. ఆపై వర్షం పడటం మ్యాచ్ జరక్కపోవడంతో శ్రీలంకను విజేతగా ప్రకటించారు.

2007, 2015 ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో కూడా ద.ఆఫ్రికా పటిష్ట జట్టుగానే బరిలోకి దిగినా కూడా వారి జయాపజాలు దురదృష్టకర రీతిలోనే జారవిడుచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2024లో కూడా విజయానికి చేరువ వరకూ వచ్చి కూడా కప్ జారవిడుచుకున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

ఎక్కువ చదివినవి

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 29 జూన్ 2024

పంచాంగం తేదీ 29-06-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ అష్టమి ప. 3.35 వరకు,...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

కేంద్ర మంత్రి పదవి.. జనసేన కోరుకోలేదా.?

జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...