వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ ‘తుఫాన్ ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.
మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ‘వెతికా నేనే నా జాడే ‘ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. భాష్యశ్రీ ఈ పాటకు లిరిక్స్ రాశారు. మాష్మి నేహా ఆలపించారు. హరి సంగీతాన్ని అందించారు. మెలోడియస్ గా సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ తుఫాన్ లా ‘ అంటూ సాగే పాట విడుదలై అలరించింది. శరత్ కుమార్, సత్యరాజ్, డాలి ధనుంజయ, మురళీ శర్మ, పృథ్వి అంబర్, శరణ్య, తలైవాసల్ విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.