Switch to English

ఢిల్లీపై దాడి: రైతు వెనుక రాక్షసత్వం ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

దేశ రాజధాని ఢిల్లీలో అలజడి.. దేశంపై దాడిగా కొందరు అభివర్ణిస్తున్నారు.. ఎర్రకోటపై జాతీయ జెండా అంటే, అది దేశ ప్రజల ఆత్మగౌరవం కిందే లెక్క. అలాంటి ఆత్మగౌరవం మీద దాడి జరిగింది. ఇది కేవలం ఢిల్లీ మీద దాడి కాదు, దేశ ప్రజలందరిపై దాడి.. అనే భావన అంతటా వ్యక్తమవుతోంది. ‘ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా’ అనడం వరకూ బాగానే వుంది. కానీ, ఆ రైతు జెండాతోపాటు, ‘వేర్పాటవాదం’ జెండా కూడా వుందనే ప్రచారం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కలిస్తాన్ వేర్పాటువాద సంస్థకు చెందిన కొందరు ఆ ‘వాదం’తో కూడిన జెండాల్ని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలో ప్రదర్శించారు.. ఎర్రకోటపైన కూడా అదే జెండా, రైతుల జెండాతో కలిసి ఎగిరిందంటూ వస్తున్న వార్తలు దేశ ప్రజానీకాన్ని కలచివేస్తున్నాయి.

‘అబ్బే, అది వేర్పాటువాదుల జెండా కాదు’ అని కొందరు చెబుతున్నా, ‘కాకపోవడమేంటి.?’ అంటూ ఇంకొందరు సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇదెక్కడి పైత్యం.? అసలు ఎందుకీ విపరీతం చోటు చేసుకుంది.? రెండు నెలలుగా ఢిల్లీ శివార్లలో అనేక కష్ట నష్టాలకోర్చి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల్ని తప్పుదోవ పట్టించేందుకు, వారి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ కుట్ర జరిగిందన్నది ఓపెన్ సీక్రెట్. కానీ, ఈ కుట్రకు పాల్పడిందెవరన్నదే తేలాలిప్పడు. రైతు సంఘాల నేతలు కొందరికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. పలువురి అరెస్టులూ జరిగాయి. కొందరిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. నటుడు, గాయకుడు దీప్ సిద్దు ఇప్పుడు ఈ వివాదంలో కార్నర్ అయ్యాడు. అతనే, ఈ మొత్తం రగడకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. 350 మందికి పైగా పోలీసులకు ఈ ఘటనలో గాయాలయ్యాయంటే, ఇది ఉద్యమం కాదు.. రాక్షసత్వమే.

రైతు ఎప్పుడూ ఇతరులకు హాని తలపెట్టడు. అలా హాని తలపెట్టేవాడు రైతే కాదు. అదే వాదన ఆందోళన చేస్తున్న రైతుల నుంచీ వ్యక్తమవుతోంది. ‘మేం నిఖార్సయిన భారతీయులం.. మా మధ్యలోకి కొన్ని అసాంఘీక శక్తులు చొరబడ్డాయి.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోండి..’ అని రైతులు చెబుతున్నారు. ఇది దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. రాజకీయాలకు తావివ్వకుండా కుట్రదారుల్ని అవసరమైతే ఉరికంబమెక్కించడానికీ కేంద్ర ప్రభుత్వం వెనుకాడబోదని ఆశిద్దాం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

పంచాంగం తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ....

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...