Switch to English

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.. అదీ ఆఫ్ ది రికార్డుగా.

‘అసెంబ్లీకి వెళ్ళబోనని వైఎస్ జగన్ అనలేదు. ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతారు. ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇప్పటికే చేశారు కదా..’ అంటోంది వైసీపీ.! కానీ, తెరవెనుక వ్యవహారాలు వేరే వున్నాయి.

సాధారణ సభ్యుడిగా, ఓ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తామనీ, ప్రతిపక్ష నేత హోదా ఆయనకు దక్కే అవకాశమే లేదని శాసన సభా వ్యవహారాల మంత్రి ఇప్పటికే ప్రకటన చేయడం చూశాం. దాంతో, వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళతారా.? లేదా.? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రతిపక్ష నేత హోదా.. అంటే, అసెంబ్లీలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంటాయి. ఏదన్నా విషయమ్మీద చర్చ జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతకు తగినంత సమయం ఇవ్వాల్సి వుంటుంది. ఇస్తారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నాలుగైదు సార్లు అడిగితే, ఓ సారైనా మైక్ ఇవ్వక తప్పదు.

ఇది కాకుండా, ఇంకా చాలా వెసులుబాట్లు వుంటాయి. అందులో, క్యాబినెట్ మినిస్టర్ స్థాయి. ఏదన్నా కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే, దానికీ కొన్ని నిబంధనలుంటాయ్.. ఆయన ప్రతిపక్ష నేత అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా ప్రత్యేక అవకాశాలు ప్రతిపక్ష నేతకు వుంటాయి.

మరి, ప్రతిపక్ష నేత హోదా వున్నప్పటికీ గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా.? అంటే, అది వేరే సందర్భం. నాలుగేళ్ళపాటు అరెస్టు విషయమై వైసీపీ ముందూ వెనుకా చూడాల్సి వచ్చింది.. ఆ ప్రతిపక్ష నేత హోదా వల్లనే.

ఇదిలా వుంటే, అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వరని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద అర్థమే వుంది. ఆ సాకు చూపి, అసెంబ్లీకి వెళ్ళకూడదనే ఆలోచనతోనే వైఎస్ జగన్ వున్నారు. ప్రతిపక్ష నేత హోదా దక్కినా జగన్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేదట. మరి, ఐదేళ్ళు ఎలా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రప్పించడం ఇప్పుడు కూటమికి పెద్ద టాస్క్.! జగన్ తనంతట తానుగా అసెంబ్లీకి దూరంగా వుండాలనుకుంటున్నా, పైకి మాత్రం, తప్పుని కూటమి వైపు ఆయన నెట్టేసేలా వైసీపీ ప్రొజెక్షన్ ఖచ్చితంగా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

Viral: మామిడి రూ.2400, మ్యాగీ ప్యాక్ రూ.300, మసాలా రూ.95..! ఎక్కడంటే..

Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...