Switch to English

పార్టీని కాపాడుకోవడం ఎలా.? వైసీపీలో అంతర్మధనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి.

అత్యద్భుత విజయం నుంచి, అత్యంత దారుణమైన పరాజయాన్ని ఎందుకు చవిచూడాల్సి వచ్చింది.. అన్న విషయమై ఆత్మ విమర్శ చేసుకోలేని పరిస్థితి.. వైసీపీ పతనానికి కారణమయ్యేలా వుంది. ఎవరో మోసం చేశారంటూ వైఎస్ జగన్, ఓటమి పాలైన వెంటనే చేసిన వ్యాఖ్యలు, ఓటర్లకు వైసీపీ పట్ల అసహ్యం పెరిగేలా చేశాయన్న చర్చ అంతటా జరుగుతోంది.

సంక్షేమ పథకాలంటే, ప్రభుత్వంలో వున్న తాము.. ప్రజలకు వేసే బిచ్చం.. అనే భావించారు వైసీపీ నేతలు గతంలో. ఆ లెక్కన, ప్రజలు మోసం చేశారంటే, ప్రభుత్వంలో వుండి తాము వేసిన బిచ్చం తిని, తమను ఓడించారనే అక్కసు వైసీపీ వెల్లగక్కినట్టే కదా.?

రాజకీయాల్లో ఇది కాదు ఆత్మ విమర్శ చేసుకునే పద్ధతి. ఓటమి ఎలా.? అన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకుని, ‘మేం మారాం..’ అని జనం ముందుకు రావాల్సి వుంటుంది. ఈ క్రమంలో అవసరమైతే, తాము చేసిన తప్పుల్ని కూడా జనం ముందు ఒప్పుకోవాల్సి వుంటుంది. కానీ, ఇలా వైసీపీ అధినాయకత్వానికి చెప్పేదెవరు.?

మంత్రులుగా పనిచేసినవాళ్ళు సైతం, ఈవీఎం ట్యాంపరింగ్ అనో.. జనం మోసం చేశారనో.. అంటోంటే, కార్యకర్తలకే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి. అధినేత బాటలోనే మంత్రులు.. కానీ, కార్యకర్తల వ్యవహారం వేరేలా వుంటుంది.

కేవలం 11 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ సీట్లతో ఐదేళ్లపాటు రాజకీయంగా మనుగడ సాధించడం వైసీపీకి కష్టసాధ్యమైన వ్యవహారమన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. కొందరు నాయకులూ ఇదే అభిప్రాయంతో వున్నారు. అధినేత వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు చిక్కకుండా బెంగళూరు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

పార్టీ శ్రేణుల అంతర్మధనం, ఆవేదన, ఆందోళన.. వీటన్నిటినీ అధినేత సక్రమమైన పద్ధతిలో అర్థం చేసుకుని, పార్టీలోని సమస్యల్ని సరిదిద్దుకుంటే తప్ప, వైసీపీ మనుగడ అసాధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

ఎక్కువ చదివినవి

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే ఉండాలి’ అని ఉంటుంది. అభిమానులను కూడా...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీకి చెందిన...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

టీమిండియా సూపర్ విక్టరీ.. సెలబ్రిటీస్ ఏమన్నారంటే?

టీమిండియా T20 వరల్డ్ కప్ సాధించడంపై జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో తలపడిన టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో...