Switch to English

బీజేపీలోకి జంప్ చేయనున్న వైసీపీ ఎంపీలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,365FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ముందు ముందు మరింత రసవత్తరంగా మారబోతోంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్ సభ సీట్లకు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభ సీట్లు తక్కువే వున్నా, రాజ్యసభలో తమకు మంచి బలం వుందనీ, అసెంబ్లీ సీట్లు తక్కువ వున్నా, శాసన మండలిలో తమకు బలం వుందనీ.. వైసీపీ చెప్పుకుంటోంది.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీలో కొనసాగేందుకు, ప్రజా ప్రతినిథులు అంత ఆసక్తి చూపడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడున్న రాజకీయాల్లో, ఇలా బలం లేని విపక్షంలో కొనసాగడం ఏ ప్రజా ప్రతినిథికి అయినా, కష్ట సాధ్యమే మరి.!

తాజాగా, వైసీపీ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలోకి దూకేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘మేం వైసీపీతోనే వుంటాం..’ అని పైకి చెబుతూనే, తెరవెనుక, బీజేపీతో ఆయా ప్రజా ప్రతినిథులు మంతనాలు జరుపుతున్నారట. బీజేపీతోనే ఎందుకు.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.

మరీ ముఖ్యంగా పార్లమెంటు సభ్యులకు పార్టీ మారే క్రమంలో బీజేపీ బెస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తోంది. గతంలోనూ ఇదే పరిస్థితి చూశాం. ఇప్పుడు ఇంకోసారి అదే సీన్ రిపీట్ అయ్యేలా వుంది. పార్టీ మారాలనుకుంటే, రాజీనామా చేసి రావాలని గతంలోనే జనసేన ‘షరతు’ పెట్టిన సంగతి తెలిసిందే.

గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన టీడీపీ, ఇప్పుడు తమకు అలాంటి అవసరమే లేదన్న కోణంలో, ‘రాజీనామా చేసిన తర్వాతే రావాలి’ అన్న షరతు విధిస్తోందిట. ఈ క్రమంలో బీజేపీ వైపే, వైసీపీ ప్రజా ప్రతినిథులు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ ఎంపీ (లోక్ సభ), మరో ఇద్దరు ఎంపీలు (రాజ్యసభ) ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుల్లో వీలైనంత ఎక్కువమందిని లాగేస్తే, గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకున్నట్లుగా చేయొచ్చని బీజేపీ అనుకుంటోందిట.

బీజేపీకి కూడా ఇటు లోక్ సభ, అటు రాజ్యసభ సభ్యుల అవసరం వున్న దరిమిలా, బీజేపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, చేరికలు వుంటాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి...

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం...

Ram Charan: గేమ్ చేంజర్ పై శంకర్ అప్డేట్.. రామ్ చరణ్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’ (Game Changer). దిల్...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల...

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

రాజకీయం

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా...

పార్టీని కాపాడుకోవడం ఎలా.? వైసీపీలో అంతర్మధనం.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ,...

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం.. సభలో నవ్వులే నవ్వులు

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా.. ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందామా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యావత్ అభిమానుల అంచనాలకు...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్...

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...