Switch to English

తెగని పంచాయితీ.! పార్టీ రహిత ఎన్నికల్లో, పార్టీల గోలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు.. ఇదంతా పంచాయితీ ఎన్నికల తొలి దశ ఫలితాల నేపథ్యంలో కనిపిస్తున్న సందడి. అయినా, పార్టీ రహితంగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో, పార్టీల గెలుపు అనే ప్రస్తావనే వుండదు. ఈ విషయాన్ని వైసీపీ, టీడీపీ పలు సందర్భాల్లో, పలు వేదికలపై సెలవిచ్చాయి. కానీ, ఎన్నికలు మాత్రం.. పార్టీల పరంగానే జరిగాయన్నట్లుగా హోరాహోరీగా తలపడ్డాయి రాజకీయ పార్టీలు.

ఓ పంచాయితీలో ఓ వ్యక్తి సర్పంచ్‌గా గెలిస్తే, ఆ వ్యక్తి అంతకు ముందు ఏ పార్టీ మద్దతుదారుడైనాసరే, అతన్ని తమవైపుకు తిప్పుకోవడం అధికారంలో వున్న పార్టీలకు కొత్త కాదు. గెలిచిన వ్యక్తి, నేను ఫలానా పార్టీ మద్దతుదారుడ్ని మొర్రో.. అని చెప్పుకుంటున్నాసరే, అతని ఇంటి మీద అధికార పార్టీ జెండాలు ఎగరేసేస్తుంటారు. ఇది ఈసారి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

ఎన్నికల వేళ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. మరి, ‘మేం 90 శాతం పైగా పంచాయితీలు గెలుస్తాం..’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.? ఇక్కడే పంచాయితీ ఎన్నికల వ్యవహారంలోని డొల్లతనం బయటపడిపోయింది.

అన్నట్టు, ఈ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా బీజేపీ – జనసేన ప్రస్తావనే కనిపించడంలేదు. బ్లూ మీడియాలో వైసీపీకి అగ్ర పీఠం దక్కితే, యెల్లో మీడియాలో టీడీపీని లేపడానికి చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో మాత్రం, జనసేన పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులు, జనసేన కండువాల్ని మెడలో వేసుకుని మరీ, తాము గెలిచిన విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదీ, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిన వైనం.

ఇంకెందుకు దాపరికం.. పంచాయితీ ఎన్నికల వ్యవస్థని మార్చేసి.. వీటిని కూడా పార్టీ పరమైన ఎన్నికలుగా మార్చేస్తే పోలా.? అప్పుడు ఎవరి సత్తా ఏంటన్నది తేలిపోతుంది. మొత్తంగా తన అధికారాన్నంతా పంచాయితీ ఎన్నికల మీద కేంద్రీకరించి.. ఇంకెవరూ పోటీ చేయకుండా, అన్నీ ఏకగ్రీవాలు చేసేసుకోవాలని అధికార వైసీపీ భావించిందిగానీ, బొక్కబోర్లా పడింది. ‘84 శాతం గెలిచాం..’ అని ఓ వైసీపీ మంత్రి చెబుతారు.. 94 శాతానికి పైగా గెలిచేశామని ఇంకో మంత్రి చెబుతారు. పార్టీ గుర్తులు మీద జరగని ఎన్నికల్లో తామే గెలిచామని చెప్పుకోవడం కన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

పంచాంగం తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు,...

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...